care

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, చింతించుట, యెంచుట, విచారించుట, లక్ష్యము చేసుట.

  • I do not care for it అది నాకు చింత లేదు, అది నాకు వద్దు.
  • he does not care for my orders నా ఆజ్ఞ లను లక్ష్య పెట్టడు.
  • not caring for his oath వాని ప్రయాణమును లక్ష్యము చేయక.
  • people whom he did not care for వానికి యిష్టము లేని వాండ్లు, కాని వాండ్లు.
  • what care for him వాడు నాకు లక్ష్యమా.
  • I did not care to tell him అది వాడితో చెప్పడానకు నేను యిచ్ఛించ లేది, అనగా నేను చెప్పలేదు.
  • he did not care to go పొయ్యేటందుకు వానికి యిచ్ఛలేదు, అనగా పోలేదు.

n., s., (caution) ఎచ్చరిక, భద్రము,జాగ్రత, (charge) భారము, సంరక్షణ, విచారణ, వశము, కాపు.

  • (oversight) పరామరిక.
  • they are my care వాండ్లు నా రక్షణలో వున్నారు.
  • these children were under his fostering care ఆ బిడ్డలు వాడి పరి పాలనలో వుండిరి.
  • I commit this to your care దీన్ని నీ వశము చేస్తాను.
  • (concern) చింత, విచారము, వ్యాకులము.
  • grief కీడు, వ్యసనము.
  • (heed or attention) పదిలము, జాగ్రత.
  • If you do not take care you will be ruined జాగ్రత పడకుంటే చెడిపోదువు.
  • Take care పరాకు, భద్రము, జాగ్రత.
  • you must take care of the dog కుక్క కరవబోతుంది భద్రము, కుక్కను జాగ్రతగా చూచుకో.
  • when I go you must take care of my horses నేను పోతే నా గుర్రాలను నీవు విచారించుకో, పరామర్శించుకో.
  • he looks care worn వాడి ముఖము చూస్తే యెండగొట్టు పడ్డట్టు వున్నది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు