head

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, అధిపతి గా వుండి నడిపించుట.

  • he headed the troops and took them into the town ఆ సేనకు నాయకుడై పట్టణము లోకి తీసుకొనిపోయినాడు.
  • he headed the spear with brass ఆ యీటెకు యిత్తళి అలుగు వేసినాడు.
  • he headed the cane with gold ఆ బెత్తానికి బంగారుపొన్ను వేసినాడు.
  • he headed the coloumn with these words ఆకత్తెంతలమీద యీ మాటలు వ్రాసినాడు.

నామవాచకం, s, తల, శిరస్సు.

  • the crown of the head నడినెత్తి, మాడుపట్టు.
  • the back of the head పెడతల.
  • this coin bears the head of the Queen యీ నాణ్యము లో రాణి ముఖమును వేసివున్నది.
  • he hid his head తలమరుగైనాడు,ముఖము తప్పించుకొనివుండినాడు, దాగివుండినాడు.
  • how did this come into your head ? యిది నీకు యెట్లా తోచినది.
  • he took it into his head that she was gone అది పోయినదనుకొన్నాడు.
  • he did it of his own head తన స్వబుద్ధిగా చేసినాడు, తనకు తానే చేసినాడు.
  • he gave all the abuse that came into his head నోటికి వచ్చినట్టెల్లా తిట్టినాడు.
  • the head of a bed మంచము యొక్క తలతట్టు.
  • a head of corn కంకి, యెన్ను.
  • the head of a spear బల్లెపు అలుగు.
  • at the head of a ship వాడ ముందరి తట్టు.
  • womans head or head dress (Johnson, Sense, Rambler No. 191.Idler No.
  • 46) స్త్రీల శిరోభూషణము.
  • these are the heads of the people ప్రజలలో వీండ్లు ముఖ్యులు.
  • these men are the heads of the caste వీరే కుల పెద్దలు.
  • he came at the head of 5000 men అయిదు వేల మందిని తీసుకొనివచ్చినాడు.
  • the head clerk పెద్ద లేఖరి, పెద్ద గుమాస్తా.
  • the head man of the village వూరి పెద్ద, గ్రామయజమానుడు.
  • he sat at the head of the table ముఖ్యమైన స్థానమందు కూర్చున్నాడు.
  • he is now at the head of the office అతను ఆ కచ్చేరి కి అధికారి గా వున్నాడు.
  • thousand head of cattle వెయ్యి పశువులు, యిటువంటి స్థలములో Head అని ఏకవచనము గా వ్రాస్తారు.
  • he paid them two rupees a head తలా రెండు రూపాయలు యిచ్చినాడు.
  • upon this head యిందున గురించి.
  • they made head against the King రాజు ను యెదిరించినారు.
  • he brought in that story head and shoulders ఆ కథ ను అసంగతముగా వుదహరించినాడు.
  • we could not made head against this wind యీ గాలిని నెట్టుకొని పోలేకపోతిమి.
  • he is a rogue from head to foot వాడికి నిలువెల్లా విషము.
  • he divided the sermon into four heads ఆ గ్రంథము ను నాలుగు భాగములుగా చేసినాడు.
  • all these articles were put under different heads in the account యీ సరుకు లు లెక్కలో వేరే వేరేపద్దులకింద కట్టబడ్డవి.
  • this is the head of the river యిది నది యొక్క వుత్పత్తిస్థానము, యిది నదీ మూలము.
  • the boil came to a headకురుపు పండబారినది.
  • the small pox came to a head అమ్మవారు నేతులు కూర్చినది.
  • this brought matters to a head యిందుతో అది ఫలోన్ముఖమైనది, యిందులో అది పరిపక్వమైనది.
  • the disease got to a headరోగము ముమ్మరించినది, ప్రబలమైనది.
  • the liquor flew to his head అతనికిమయకమెక్కినది.
  • he gave his horse the head and it ran away కళ్లెము సళ్లవిడిచినందున గుర్రము పారిపోయినది.
  • two headed రెండు తలలు గల.
  • long headed అ దూరాలోచనగల.
  • hot headed man ముంగోపి.
  • he plunged in the river over head and ears ఏట్లో శుద్ధముగా ముణిగిపోయినాడు.
  • they laid their heads together వాండ్లు ఆలోచించుకొన్నారు.
  • It went out of his head మరిచిపోయినాడు.
  • his folly be upon his own head వాడి తప్పు వాణ్ని కొట్టుకొనిపోనీ.
  • at last the cholelra showed its headతుద కు వాంతిభ్రాంతి కనిపించినది.
  • his ship was two miles a head of mine నా వాడకు అతని వాడ కోశెడు దూరము ముందుపోయి వుండినది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. K. English pronunciation words వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు