make

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఆకారము, స్వరూపము.

  • his make resembles that of his brother వాడి అన్న వాడు వొకటే మచ్చుగా వున్నారు.

క్రియ, నామవాచకం, పోవుట, వచ్చుట.

  • the tide made at noon మధ్యాహ్నవేళకుపోటు ఆరంభమైనది.
  • they made towards me నాకై వచ్చిరి.
  • they made off towards the hill కొండపై పారిపోయినారు.
  • they made towards me నాకై వచ్చిరి.
  • they made off towards the hill కొండకై పారిపోయినారు.
  • they made back వెనక్కు పోయిరి, వెనక్కు తీసిరి.
  • they made up to him వాడివద్దికి పోయినారు.
  • this makes against him యిది వాడికి విరుద్ధమౌతున్నది.
  • he made across the fields పొలములో అడ్డము తొక్కిపోయినాడు.
  • do not make or meddle నీవు చేయవద్దు చెందవద్దు.
  • she made believe to strike him వాణ్ని కొట్టేటట్టు అభినయించినది.
  • he made believe to be angry కోపముగావున్నట్టు నటించినాడు.
  • that business is all a make believe అది అంతా వట్టిటక్కు.

క్రియ, విశేషణం, చేసుట; చేయించుట, సృష్టించుట, కల్పించుట, యేర్పరచుట.

  • he made a table మేజను చేసినాడు, చేయించినాడు.
  • God made the world దేవుడు ప్రపంచమును సృష్టించినాడు.
  • he made a bow or reverence దణ్నము పెట్టినాడు.
  • they made a demand against me నన్ను రూకలు అడిగినారు.
  • he made an effort యత్నపడ్డాడు.
  • he made much money by this యిందులో వాడికి మంచి లాభము వచ్చినది.
  • I can make nothing of this letter యీ జాబులో నాకు యేమిన్ని తెలియలేదు, యీ జాబు నాకు అసాధ్యము.
  • he could not tell what to make of it అది యేమిటో వాడికి వొకటీ తోచలేదు.
  • he made an image of gold బంగారముతో విగ్రహమును పోసినాడు.
  • she made my bed అది నాకు పడక వేసినది.
  • he made his bed on the rock రాతిమీద పండుకొన్నాడు.
  • he makes a god of his teacher ఉపాధ్యాయులను దేవుణ్నిగా విచారిస్తాడు.
  • he makes shoes చెప్పులు కుట్టుతాడు.
  • they made him a schoolmaster వాణ్ని వుపాధ్యాయులుగా పెట్టినారు, ఉపాధ్యాయుని ఉద్యోగమును యిచ్చినారు.
  • he made her a whore దాన్ని చేరిపి నాడు.
  • he made his son a tailor కొడుకుకు కుట్రపుపని నేర్పినాడు.
  • I will make you an example నిన్ను సాటువచేస్తాను, అనగా నీకు చేసే శిక్షచేత అందరికి బుద్ధివచ్చేటట్టు చేస్తాను.
  • twelve and four annas make a nine మూడు మూళ్లు తొమ్మిది.
  • with this money I cannot make both ends meet యీ రూకలతో ఆ పనిని సాగవేయలేను, నెరవేర్చలేను.
  • they make the most of a single instance వొకసారి జరిగిన దాన్ని పట్టుకొని వూరికె పెంచుతారు.
  • he did not make his appearance వాడు హాజరుకాలేదు, అగుపడలేదు.
  • this boy will make a good scholar యీ పిల్లకాయ మంచి పండితుడౌను.
  • will you make one of our party? మాలో వొకడుగా వుంటావా.
  • he made me believe that he would pay the money తాను రూకలు యిచ్చేటట్టు నన్ను నమ్మించినాడు.
  • he made this known తెలియజేసినాడు.
  • he made himself known ప్రసిద్ధుడైనాడు.
  • what made you write tohim? వాడికి వ్రాయడానకు నీకేమి పట్టినది.
  • I made him write a letter to them వాణ్నికొని వాండ్లకు జాబు వ్రాయిస్తిని.
  • I made him forget వాణ్ని మరిచేటట్టు చేస్తిని.
  • I made him come వాణ్ని రప్పించినాను.
  • I made him eat it తినిపిస్తిన, వాణ్ని కాచుకోపెట్టితిని.
  • this story makes him her son యీ మాటవల్ల నాడు దాని కొడుకౌతాడు.
  • this made me angry యిందువల్ల నాకు కోపము వచ్చినది.
  • she makes the child cry ఆ బిడ్డను యేడ్పిస్తున్నది.
  • he made for laugh దాన్ని నవ్వించినాడు.
  • none shall make them afraid వాండ్లను భయపెట్టేవారు యెవరున్నులేరు.
  • he made me acquainted with the subject ఆ సంగతిని నాకు తెలియచేసినాడు.
  • this was the making of him యిది వాడి ఐశ్వర్యమునకు కారణము.
  • he is a made man వాడి పని కుదిరినది, వాడికి యికను చింతలేదు.
  • a basket made of bamboo slips వెదురుగంప,వెదురుబద్దలతో అల్లిన గంప.
  • a mat made of bulrush తుంగచాప.
  • acoat made of cloth సెకలాతులో కుట్టిన చొక్కాయి.
  • a garland made of roses రోజా పువ్వులతో కట్టిన దండ.
  • a cloth made of hemp నారచీర, జనపనారతో నేసిన చీర.
  • This wood makes excellent wheels యిది చక్రానికిమంచికొయ్య.
  • The following are alphabetically arranged.
  • He made anapology క్షమించవలె నన్నాడు, మన్నించవలె నన్నాడు.
  • he made away withthe money ఆ రూకలను అపహరించినాడు, నోట్లో వేసుకొన్నాడు.
  • he made away with the child ఆ బిడ్డను దొంగిలించుకొని పోయినాడు, లేక, చంపివేసినాడు.
  • he made away with himself హత్యచేసుకొన్నాడు.
  • this makes no difference యిందువల్ల యేమిన్ని వ్యత్యాసములేదు.
  • she made faces at me నన్ను వెక్కిరించినది.
  • to make free స్వతంత్రించుట.
  • I made free to borrow you horse నేను స్వతంత్రించి తమ గుర్రాన్ని తీసుకొన్నాను.
  • they made friends with him వాడితో విహితము చేసుకొన్నారు.
  • I shall make the loss good ఆ నష్టమును నేను అచ్చుకొంటాను.
  • he made his assertion good తాను చెప్పిన మాటను సాధించినాడు, స్థిరపరచినాడు.
  • he made a journeyto calcutta కల్లత్తాకు పోయినాడు.
  • the ship made the land or shore ఆ వాడ రేవుకై వచ్చినది.
  • he made light of the matter ఆ సంగతిని అలక్ష్యము చేసినాడు.
  • he made love to her దాన్ని లాలించినాడు, బుజ్జగించినాడు,వలపించినాడు.
  • they made merry తిని తాగి సంభ్రమముగా వుండిరి, ఉల్లాసముగా వుండిరి.
  • he made money నిండా రూకలు కూడపెట్టినాడు.
  • he made much of them వాండ్లయందు చాలా విశ్వాసముగా వుండినాడు.
  • he makes nothing of translatinga paper దస్తావేజుకు భాషాంతరము చేయడము వాడికి అవలీల.
  • I cannot make the meaning out దీని భావమును వెళ్ళదీయలేను, యిది నాకు అర్థము కాలేదు.
  • can you make out who that is? వాడెవడో నీవు కనుక్కోగలవా.
  • he made out acase or statement ఆ సంగతిని కుదిర్చి వ్రాసినాడు.
  • they make her out to behis sister అది వాడి తోడబుట్టినదని కనుక్కొన్నారు.
  • he made out his claim తన వ్యాజ్యమును రుజువు చేసినాడు.
  • he made over the property to me ఆ సొత్తును నాకు వొప్పగించినాడు, నాపరము చేసినాడు.
  • he made overthe cattle to me ఆ గొడ్లను నాకు తోలి యిచ్చినాడు.
  • he made peace withthem వాండ్లతో సఖ్య పడ్డాడు.
  • to make a pen కలం చెక్కుట, కలం చివ్వుట.
  • to make a pit గొయ్యితీయుట, పల్లము తవ్వుట.
  • he made a present to them వాండ్లకు బహుమానము చేసినాడు.
  • he made every thing ready అన్నిటిని సిద్ధపరచినాడు.
  • make room or stand back వొత్తండి, యెడము విడవండి, తొలగిండి.
  • make room or remove these things యీ స్థలమును వోరిశలు చేయండి.
  • he made room for me in his bed వాడి పడకలో నాకు యెడమిచ్చినాడు.
  • the ship made sail ఆ వాడ బయలు దేలినది.
  • he made a secret of this దాన్ని దాచినాడు.
  • I will make shift with this table యీ మేజాతోనే గడుపుకొంటాను.
  • he made shipwrek వాడి పుట్టి ముణిగినది.
  • to make sour పులియబెట్టుట.
  • you may make sure of the money రూకలు దొరుకునని గట్టిగానమ్ము.
  • I made sure of your coming మీరు వస్తారని నిశ్చయముగా యెంచుకొనివుంటిని.
  • I now make sure of his friendship యింతలో అతడు నాకు స్నేహితుడుకాబోతాడని నిశ్చయమగా నమ్మియుంటిని.
  • he made sure of the purchase అది తనకు లభ్యమౌననుకొన్నాడు.
  • to make tea of coffee తేనీళ్లు సిద్ధము చేసుట.
  • he made up a bond వొక పత్రమును సృష్టించినాడు, కల్పించినాడు.
  • he madeup matters or the quarrel రాజీచేసినాడు, సమాధానము చేసినాడు.
  • he made up his mind to sell the house యింటిని అమ్మేటట్టు నిశ్చయించుకొన్నాడు.
  • its utility will make up for its difficulty కష్టానికి తగిన ఫలముకలుగును.
  • he made up his account with merchants ఆ వర్తకుల దగ్గెరలెక్క తీర్చుకొన్నాడు.
  • he made use of fond language ముద్దుమాట లాడినాను.
  • he made use of wax in this దీంట్లో మయినమును వుపయోగించినాడు.
  • formely they made use of bows and arrows in war పూర్వకాలమందు యుద్ధములోధనుర్బాణములను వాడినారు.
  • they made war with the French ప్రాంసువారితో యుద్ధము చేసినారు.
  • to make water వుచ్చపోసుట, లఘుశంకచేసుట.
  • make way దోవతియ్యి, దోవవిడువుము.
  • he made his way throught the forest అడవిని పడిపోయనాడు.
  • the thieves made their way into my house మా యింట్లో దొంగలు చొరబడ్డారు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:U. K. English pronunciation words వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. K. English pronunciation words వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు