under

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

preposition, కింద, అడుగున, he put the stick under his arm కర్ర ను చంక పెట్టుకొన్నాడు.

  • this cannot be finished under three days యిది మూడు దినాలలో కాదు.
  • I studied under him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని.
  • I held a situation under him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని.
  • thedistance is under ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువ గా వున్నది.
  • under thesecircumstances ఇట్లా వుండగా.
  • the matter under consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి.
  • a letter under date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశిన జాబు.
  • he gave me this declaration under his own hand యీ వాఙ్మూలము ను తన చేవ్రాలు సహితము గా నాచేతికి యిచ్చినాడు.
  • I have this under his hand యిది వాని చేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది.
  • he paid ten rupees under the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు.
  • under the orders received ఆజ్ఞా ప్రకారముగా.
  • hecheated me under the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసము చేసినాడు.
  • this is known under the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.
  • there is a road under the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది.
  • he stood under thewall గోడ వద్ద నిలిచినాడు.
  • you cannot get it under that price నీకు ఆ వెల కు తక్కువగా అది చిక్కదు.
  • he is under my protection నా సంరక్షణ లో వున్నాడు.
  • the roadis under repairs యీ దోవ ను బాగుచేస్తున్నారు.
  • he told me this under the rose దీన్నినాతో రహస్యము గా చెప్పినాడు.
  • the ship is now under sail వాడ చాపలు విప్పినడుస్తున్నది.
  • they kept him under వాణ్ని అణిచిపెట్టినారు.
  • they drain the land tokeep the water under నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు.
  • one who is underage ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.
  • children under two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు.
  • he is now under acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది.
  • an under farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు.
  • underclerk కరణము చేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా.
  • an under garment అడుగు వస్త్రము.
  • hespoke in an under tone హీనస్వరము గా మాట్లాడినాడు.
  • I smote him under the fifth ribవాణ్ని డొక్క లో పొడిచినాను.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు